నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు లక్ష్మయ్య, మధు, చలపతిరావు, మధుబాబు, సువార్తమ్మ, పర్వీన్ ల ఆధ్వర్యంలో విద్యార్ధులకు క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. విద్యార్ధులు స్వయంగా తయారుచేసిన సైన్స్ మోడల్స్ ను ప్రదర్శించారు.
50 కి పైగా ప్రదర్శనలను విద్యార్ధులు తయారుచేసి ప్రదర్శించారు. ఇందులో వెల్డింగ్ గ్యాస్ తయారి , మెక్రోస్కోప్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అధ్యక్షతన నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో అన్ని పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతలును అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడలో శాస్త్రీయత మూలమని శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్యార్ధులు కృషి చేయాలని మంచి కోసం కృత్రిమ మేథస్సు ను వినియోగించాలని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నరు.



