నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ వివిధ రకాల ప్రాజెక్ట్ వర్క్ వర్కింగ్ మోడల్ సైన్స్ కు సంబంధించిన వర్కింగ్ మోడల్ చిన్నారులు అందరూ ఎంతో చక్కగా ప్రదర్శించడం దాని గురించి చక్కగా వివరించడం జరిగింది. సివి రామన్ చిత్రపటానికి చిత్రమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్ దినోత్సవం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ఫలితంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో..
మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో రామన్ ఎఫెక్ట్ కనుగొనబడిన రోజును పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రయోగాలను ప్రదర్శించి వివరించడం జరిగింది. విద్యార్థినులు గుండె మరియు మైక్రోస్కోప్ లను రంగోలి పోటీలలో చాలా అందంగా వేయడం జరిగింది. క్విజ్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని డ్రామాలు ప్రదర్శించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.



