నవతెలంగాణ – బజార్ హాత్నూర్
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. మండల కేంద్రంలోని కురుక్షేత్ర పాఠశాలలో విద్యార్థులు పలు విధాల సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. సైన్స్ క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కురుక్షేత్ర పాఠశాల ప్రిన్సిపల్ సబ్బిడి నవీన్ కుమార్ మాట్లాడుతూ సైన్స్‌తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, కరోనా వంటి కష్ట కాలంలోనూ మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసి ఎన్నో దేశాల ప్రజలను కాపాడారని, విద్యార్ధుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్‌ఫేర్లు ఎంతగానో దోహద పడుతాయని, సాంకేతికతను అందిపు చ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోషకులు, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



