నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో జాతయ విద్యార్థి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ సాతరలో రాజా వాడ చౌక్ లో ఉన్న ప్రతాప్ సింగ్ ఉన్నత పాఠశాలలో 1900 నవంబర్ 7 నుండి 1904 మధ్య అంబేద్కర్ నాల్గవ తరగతి వరకు చదువుకున్నారన్నారు.ఈ పాఠశాల అడ్మిషన్, ఎగ్జిట్ రిజిస్టర్ యొక్క సీరియల్ నంబర్ 1914, దానిపై డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ పేరు వ్రాయబడిందన్నారు. ఈ రిజిస్టర్‌లోని సీరియల్ నంబర్‌పై భీంరావ్ రాంజీ అంబేద్కర్ సంతకం చేశారన్నారు. అందుకే నవంబర్ 7ను జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకోవాలని, నేటికీ 125 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏవైఎస్ మండల ప్రధాన కార్యదర్శి జాంబవ చమార్, ఉపాధ్యక్షులు దాస్, గౌరవ సలహాదారులు క్రాంతి, దళిత సంఘాల కార్యవర్గ సభ్యులు రవి, అనంతరావు, మండల ఏవైఎస్ కమిటీ, మండల దళిత సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ లో జాతీయ విద్యార్థి దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



