Saturday, November 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విద్యా భారతి పాఠశాలలో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్..

విద్యా భారతి పాఠశాలలో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్..

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పురంశెట్టి లింగయ్య మాట్లాడుతూ…. న్యాయ న్యాయవాద వృత్తి చేస్తూ స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రజలను రైతులను చైతన్య పరిచారని స్వదేశీ సంస్థానాల విలీనం కోసం ఎంతగానో కృషి చేశాడని, వ్యక్తిగత, ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశ సమైక్యత సమగ్రత గొప్పవని చాటిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోతన్న, కరస్పాండెంట్ గంగా సింగ్, ఉపాధ్యాయులు సాయినాథ్, భోజన్న, కొట్టే రాజు, దేవకి, కవిత, సరోజన , రాణి, అంజలి, శ్రీవిద్య, పద్మ, శృతిక, నందిని, నేహ, గంగమణి, సరస్వతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -