నవతెలంగాణ – ఆలేరు రూరల్
హిందీ భాష భారతీయ ప్రజల సమైక్యతను పెంపొందించేందుకు ఉపయోగపడు తుందని ప్రధానోపాధ్యాయురాలు కోడం రమాదేవి అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టంగుటూరులో హిందీ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందీ భాష జాతీయ భాష అని ఇది భారతదేశాన్ని భారతీయులందరినీ కలిపేటటువంటి భాషని హిందీ భాష ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరించారు.అనంతరం హిందీ ఉపాధ్యాయులు మహమ్మద్ ఖాజా అలీ ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు.ఆ తర్వాత విద్యార్థులు చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.విద్యార్థులు డ్రాయింగ్ పెయింటింగ్ వకృత్వం వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రవికుమార్,శ్రీనివాస్, కుమారస్వామి, వెంకటేష్,జయశ్రీ, లింగయ్య,మహమ్మద్ ఖాజా అలీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
హిందీ భాషతోనే జాతీయ సమైక్యత : కోడం రమాదేవి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES