Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం 

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం 

- Advertisement -

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డ
నవతెలంగాణ – నెల్లికుదురు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–II ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పెద్దూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్  ఆరిగకూటి శ్రీనివాసరెడ్డి మరియు ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యువత రాజకీయ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఎలాంటి భయాలు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన హక్కు. ఈ హక్కును వినియోగించుకోవడం మన బాధ్యతని, ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం మనకు లభిస్తుందని అన్నారు. యువత ముందుకొచ్చి ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి శ్రీనివాస్, ప్రకాష్ బాబు, కవిరాజ్, నాగేశ్వరావు, రామ్మూర్తి, మహేందర్, బాబు, యాకన్న, సతీష్, సుభాష్ అధ్యాపకేతర బృందం ప్రదీప్, గౌరీశంకర్, లక్ష్మణ్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -