నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం 16వ జాతీయ ఓటరు దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులతో మండల రెవెన్యూ అధికారి శరత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ప్రతి సంవత్సరం ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేవా అని ఒకటికి రెండు సార్లు ఏప్పటికప్పుడు సదరు ఓటరు తనిఖీ చేసుకోవాలన్నారు.అలాగే ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా తప్పకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిదని దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతం విద్యార్థినులకు స్కిప్పింగ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగామణి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



