– మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నోటీస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసును తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) అందించింది. శనివారం హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో పీఎస్ మునావర్‌అలీని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎలమోని స్వప్న, ఉపాధ్యక్షులు పద్మ, వెలిశాల క్రిష్ణమాచారి కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈనెల 20న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సమ్మెలో ఉంటారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి నిధులను పెంచడం లేదని పేర్కొన్నారు. అక్షయపాత్ర, నాంది ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి మధ్యా హ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా నాలుగు లేబర్ కోడ్‌లను తెస్తున్నదని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు పెంచాలనీ, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్ల బిల్లులను, 3 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని తెలిపారు.
సమ్మెలో సెక్యూరిటీ గార్డులు
ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సెక్యూరిటీ గార్డులు పాల్గొంటున్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులకు శనివారం తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న సమ్మె నోటీసును అందజేశారు. కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. అప్పటి వరకు మినిమం టైంస్కేల్ రూ.19 ఇవ్వాలని తెలిపారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలనీ, నేరుగా మార్కెట్ కమిటీల ద్వారా వేతనాలను చెల్లించాలని పేర్కొన్నారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ మార్కెట్ కమిటీలే చెల్లించాలని తెలిపారు. ప్రసూతి సెలవులు, సహజ మరణానికి రూ.రెండు లక్షలు, ప్రమాద మరణానికి రూ.ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా మార్కెట్ కమిటీలే చెల్లించాలని డిమాండ్ చేశారు. దహన సంస్కారాల కోసం రూ.15 వేలు ఇవ్వాలని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.ఐదు లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు.
20న దేశవ్యాప్త సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES