- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : కాటారం డిఎస్పి సూర్యనారాయణ, సీఐ నాగార్జున రావు ఆదేశాల మేరకు బుధవారం కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్ తన సిబ్బందితో తాడిచెర్ల గ్రామంలో పెట్రోలింగ్ చేశారు. అనుమానిత గుడుంబాను గుర్తించారు. దీనిని విక్రయించే జోడు రవి వద్ద నుండి 24 లీటర్ల గుడుంబా పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి, అవగాహన కల్పించారు. ఎవరైనా చట్టవృత్తి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -