– అభినందించిన ఉద్యానవన శాఖ కమీషనర్
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రతిబింబించే విధంగా, నవతెలంగాణ దినపత్రిక 2026 క్యాలెండర్ ను రూపొందించడం హర్షించదగ్గ విషయమని ఉద్యానవన శాఖ కమీషనర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ఈ సందర్భంగా నవ తెలంగాణ దినపత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన సంబంధించిన చిత్రపటాలను ప్రత్యేకంగా గుర్తించి ప్రతి నెలకు ఒక ఉద్యాన పంట సంబంధించిన ఫోటోలు ప్రచురించడం ప్రజలకు అందించడం వారి ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని అభినందించారు.

ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య మీడియా ఎప్పుడు వారధిగానే వ్యవహరించాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలపై తమ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి ఉందని ఇలాంటి వినూత్న కార్యక్రమాలు, సూచనలు మా డిపార్ట్మెంట్ కు ఎంత ఉపయోగకరమని ఆమె తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకి మా డిపార్ట్మెంట్ తరఫున సహకరించడానికి ముందంజలో ఉంటామని చెప్పారు. ఈకార్యక్రమంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డి, ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్స్ రామలక్ష్మి, సంగీత లక్ష్మి, నవతెలంగాణ జనరల్ మేనేజర్స్ ఎ. వెంకటేష్, నరేందర్ రెడ్డి, బత్తాయి రైతు సంఘం సభ్యులు ఎస్. వెంకట్ రెడ్డి, నవతెలంగాణ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, కె.వి.రమణ, నందకిషోర్, మురళీ, ఉద్యానవన శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



