నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గట్టు కొమురయ్య మృతికి నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు. కొమురయ్య కుమార్తె రాణి నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డులో సబ్‌ఎడిటర్‌గా, ఆయన అల్లుడు వెంకటేశ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. మరణవార్త తెలుసుకున్న నవతెలంగాణ సీజీఎం, ఉద్యోగులు రామంతాపూర్‌లోని వారి నివాసానికి వెళ్లారు. కొమురయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంస్థలో నిబద్ధతతో పనిచేస్తున్న ఇద్దరికీ కుటుంబ పెద్ద మరణించడం తీవ్ర లోటు అనీ, నవతెలంగాణ తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొమురయ్య మృతికి సంతాపం తెలిపిన వారిలో నవ తెలంగాణ జనరల్ మేనేజర్లు నరేందర్ రెడ్డి, రఘు, శశిధర్, బోర్డు సభ్యులు సలీమా, అజరు, మేనేజర్ రేణుకలతో పాటు, నవతెలంగాణ సిబ్బంది ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి, శశికళ, లలిత, మల్లీశ్వరి, మేనక, భారతి, బాలరాజు, అశోక్, మురళి, సైదిరెడ్డి వివిధ విభాగాల సిబ్బంది ఉన్నారు.
గట్టు కొమురయ్యకు నవతెలంగాణ సీజీఎం శ్రద్ధాంజలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES