- Advertisement -
తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ఎం.కోదండరెడ్డి
వామపక్ష పార్టీలు నడిపించే పత్రికలు ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గదర్శిగా పని చేసిన పత్రికలు. నాటి ప్రజాశక్తి గానీ, నేటి నవతెలంగాణ గానీ మార్గదర్శిగా నిలిచినవే. నవతెలంగాణ 10 ఏండ్లు పూర్తయిన సందర్భంలో పత్రిక చదువరులకు, ఆ పత్రికలో పని చేసే వారికి శుభాకాంక్షలు. నేటి రాజకీయాలు పూర్తిగా గాడి తప్పాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరోమాటగా మారాయి. కానీ, ప్రజాశక్తి పోరాట బాటలో ప్రజలకు బాసటగా నిలిచిన నవతెలంగాణకు కమిషన్ పక్షాన శుభాకాంక్షలు. వారి బాటను నేటి రాజకీయ పార్టీలు ఆదర్శంగా తీసుకోవాలి.
- Advertisement -