Wednesday, September 24, 2025
E-PAPER
Homeజిల్లాలుసమస్యల పరిష్కార మార్గదర్శి నవతెలంగాణ : ఎంఈఓ

సమస్యల పరిష్కార మార్గదర్శి నవతెలంగాణ : ఎంఈఓ

- Advertisement -

పాఠకుల గొంతుకై ప్రశ్నించే వేదిక అయింది: మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

ముందుగా నవతెలంగాణ దినపత్రికకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభింపబడిన నవతెలంగాణ దినపత్రిక.. పాఠకుల యొక్క ఆదరణను ఎంతో చూరగొన్నది. పాఠకుల గొంతుకై ప్రశ్నించే వేదిక అయింది. అంతేకాకుండా స్థానిక సమస్యలతో పాటు రాష్ట్రస్థాయి సమస్యలను పత్రికలలో ప్రచురిస్తూ.. వాటికి పరిష్కారానికి మార్గదర్శి అయ్యింది. నవతెలంగాణ దినపత్రికకు నేను అభిమాన పాఠకున్ని. మా విద్యారంగంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తూ విద్యా రంగం సాధిస్తున్నటువంటి విజయాలను ఎప్పటికప్పుడు ఈ దినపత్రికలో ప్రచురిస్తూ పాఠకలోకానికి తెలియపరుస్తోంది.

మండలంలోని పలు స్కూళ్లలో జరిగేటటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల యొక్క సాంస్కృతిక, సాంకేతిక నైపుణ్యాలను ఏ రోజుకు ఆ రోజు ప్రచురిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎంతో అండగా నిలుస్తున్నది. అభ్యుద భావాలతో ప్రచురింపబడే వ్యాసాలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఒక మంచి ప్రోగ్రెసివ్ భావాలతో ముందుకెళ్తూ.. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్న ఈ పత్రికకు ఇంకా ఎంతో ఆదరణ లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మా విద్యాశాఖకు ఎంతో అండగా నిలుస్తున్న పత్రిక యాజమాన్యానికి, సంపాదక వర్గానికి, పత్రిక విలేకరులకు, సిబ్బందికి, మండల విద్యాశాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మునుముందు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -