- Advertisement -
నవతెలంగాణ – కరీంనగర్
‘నవతెలంగాణ’ కరీంనగర్ రీజియన్ డెస్క్ ఇన్‌చార్జి బండారి రాకేష్ తండ్రి రాజయ్య (60) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, సీజీఎం ప్రభాకర్, మఫీషియల్ ఇన్‌చార్జి వేణు మాధవ్, జీఎం శశిధర్ సంతాపం తెలిపారు. కరీంనగర్ రీజియన్ మేనేజర్ యాదగిరి సహా ఉద్యోగులు, సిబ్బంది, విలేకరులు రాకేష్‌ను ఓదార్చి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. రాజయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేటలో నిర్వహించనున్నారు.
- Advertisement -



