ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి
నవతెలంగాణ – బాల్కొండ
సమాజాన్ని చైతన్య పరిచే దిశగా వార్తలు రాయడంలో నవతెలంగాణ దినపత్రిక పనితీరు ప్రత్యేక గుర్తింపు చాటుతుందని ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సోమవారం నవతెలంగాణ 2026 క్యాలెండర్, డైరీలను సీఐ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ .. నేటి సమాజంలో ప్రచార సాధనాలలో భాగంగా పత్రికల పాత్ర ఎంతో అవసరం, ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం పత్రికలే అన్నారు.
అందులో భాగంగా నవతెలంగాణ పత్రిక కార్మిక, కర్షక వర్గాల కోసం నిరంతరం వారి సమస్యలపై వార్తలను రాస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అందరి మన్నలను పొందుతుందని అన్నారు. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి ఆధునిక నేరాలపై ప్రత్యేక కథనాలతో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరిస్తూన్న నేపథ్యంలో పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



