ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
నవతెలంగాణ దినపత్రిక ప్రధానంగా సమాజంలోని కార్మికులు, రైతులు, యువకులు, అట్టడుగు వర్గాల, మహిళల గొంతుకగా పనిచేస్తుంది. ప్రజలందరినీ చైతన్య, పరుస్తున్నది, కార్పోరేట్ అనుకూల విధానాంకు ప్రత్యామ్నాయంగా ప్రజల అనుకూల విధానాలను వార్తల రూపంలో ప్రచారంలో పెడుతుంది. నవతెలంగాణ దినపత్రిక రాబోయే రోజుల్లో మరింత సదురుగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాం. నవతెలంగాణ పత్రికకు 10 వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుల నియమ నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలి. మద్యం సేవించి వాహనాలను నడపకూడదు. మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదు. వాహనాలు నడిపే వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అలాగే వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ తెలిపారు.