నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రతి ఉదయాన.. ప్రతి హృదయంలో ఉషోదయాన్ని నింపుతూ అనుదినం జన స్వరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రచురిస్తూ.. పరిష్కారం కోసం అలుపెరగని కృషి చేస్తున్న ‘నవతెలంగాణ’ యాజమాన్యానికి పాత్రికేయులకు, సిబ్బందికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నవ తెలంగాణ పత్రిక లక్ష్యసాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వార్తా సేకరణ యంత్రాంగాన్ని ఏర్పరుచుకుని ప్రజల సహాయంతో వార్తను సచిత్రంగా వేగంగా చేరవేయగల యంత్రాలను సమకూర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు విశ్లేషణ యుక్తంగా పాఠకులకు అందించడాన్ని కొనసాగిస్తూనే స్థానిక వార్తలకు పెద్దపీట వేసింది. రాజకీయ బేధాభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వార్తా విలువ కలిగిన ప్రతి ఘటన నవ తెలంగాణ వార్తగా చూపెడుతూ వస్తున్నది.
తెలంగాణ గడ్డ నుంచి వెలువడుతున్న ప్రధాన పత్రికల్లో ‘నవతెలంగాణ’ ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. నిజాయితీ నిబద్దతతే పునాదులుగా పయని స్తున్నది. ప్రజల దష్టితోనే వార్తా విశ్లేషణాలు వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో విలువలకు కట్టుబడే వారా కథనాలు వెలువడుతున్నాయి. ఆర్థికంగా అట్టడుగునున్న ప్రజల గొంతుగా నిలు స్తున్న వెలుగుదీపిక అందరి ‘నవతెలంగాణ పత్రిక’ అని చెప్పవచ్చు. సమస్యలను ప్రతిబింబించేలా కథనాలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తున్నది. నవతెలంగాణ ప్రజలను చైతన్యవంతులుగా మారుస్తూ ప్రత్యేక కథనాలు శీర్షికలు ప్రచురిస్తూ కార్మికవర్గానికి బాసటగా నిలుస్తున్న పత్రిక నవతెలంగాణకు మనస్ఫూర్తిగా పదోవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నవతెలంగాణ అలుపెరుగని కృషి: మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES