దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అందించిన ‘ఆరో’
కళాకారులను జ్ఞాపికలు అందించిన కోహినూర్ నివాసితులు
నవతెలంగాణ – హైదరాబాద్
కోహినూర్ నివాసితుల ఆధ్వర్యంలో ‘నవదుర్గా స్వరూపిణి’ పేరుతో ప్రత్యేక భక్తి సంగీత కార్యక్రమాన్ని దసరా నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించారు. హోప్ అడ్వర్టైజింగ్ ప్రయివేట్ లిమిటెడ్ సహకారంతో అమ్మవారి నవరాత్రుల నేపథ్యంతో కూడిన వివిధ కీర్తనలను ఆరో అందించగా, ప్రతిమ శశిధర్ ఎంతో మనోహరంగా ఆలపించారు. ఆమెకు శుశ్రుత, మేఘన, వందన, శతి, శ్రీచందన, ప్రజ్ఞ అలంకతలు చక్కటి సహకార గాత్రం అందించారు. కార్యక్రమానికి వాసుశాస్త్రి వయోలిన్, గురుప్రసాద్ కీబోర్డు, డా. శ్రీకాంత్ మదంగం, జయకుమార్ ఆచార్యలు తబల సహకారం అందించారు.
అమ్మవారి గీతాలను ప్రతిమ శశిధర్ తన శ్రావ్యమైన గాత్రంతో ఆలపించగా, చక్కని ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రోతలు ప్రతి కీర్తననూ శ్రద్ధాసక్తులతో ఆలకించి తన్మయత్వం చెందారు. భక్తిగీతాల నేపథ్యాన్నీ, వాటి ద్వారా భక్తులు పొందగలిగే తన్మయత్వాన్ని గురించి మహీధర సీతారామశర్మ విశ్లేషణాత్మకంగా వివరించారు. కార్యక్రమ అనంతరం కోహినూర్ నివాసితులు కళాకారులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి కోహినూర్ వాసులు పెద్దఎత్తున హాజరయి ఆహ్లాదభరితమైన సంగీత కచేరీని ఆసాంతం ఆస్వాదించారు. కచేరీని ప్రత్యక్షంగా వీక్షించనివారు https://youtube.com/live/yqMnMmQEYUo లో చూడవచ్చు.