– సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ తుంగతుర్తి:
సామాజిక బాధ్యతతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, సామాజిక సేవలో భాగస్వామ్యం అవుతూ, నిజాలు నిర్భయంగా రాసి,ప్రజలలో మంచి పేరు సంపాదించిన పత్రిక నవతెలంగాణ దినపత్రిక అని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నవతెలంగాణ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసి మాట్లాడారు.నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో నవతెలంగాణ పాత్ర ప్రత్యేకమైనదని అన్నారు.ప్రజలకు పాలకులకు వారధిగా పనిచేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలని సూచించారు.
పత్రికలలో కథనాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ,ప్రజలకు సమాజంలో జరుగుతున్న వాటిపై తెలియజేసే బాధ్యత పత్రికలదే ఉన్నారు.అనంతరం నవతెలంగాణ బృందానికి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలిశాల సరిత,వార్డు మెంబర్లు కడారి సుకన్య,బోర లింగయ్య,దొంగరి సోమయ్య,ఇరుగు లావణ్య,బింగి వెంకటేశ్వర్లు,బల్లెం ప్రవీణ్,మరికంటి జానకమ్మ,మరికంటి శ్యాం ప్రసాద్,పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్,కారోబార్ అనిల్ కుమార్,బిఆర్ఎస్ నాయకులు మట్టపల్లి వెంకట్,కడారి దేవదాసు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



