Monday, March 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైభవంగా నవతెలంగాణ సీజీఎం కుమారుని వివాహం

వైభవంగా నవతెలంగాణ సీజీఎం కుమారుని వివాహం

- Advertisement -

హాజరైన సీపీఐ(ఎం) నేతలు, బంధువులు, మిత్రులు, సన్నిహితులు

నవతెలంగాణ-మంచిర్యాల
నవతెలంగాణ దినపత్రిక సీజీఎం ప్రభాకర్‌ కుమారుని వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన రోహిత్‌, కావ్య వివాహ వేడుకకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌, తెలంగాణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేశ్‌, ప్రజాశక్తి సంపాదకులు తులసీదాస్‌, సీజీఎం అచ్చుత్‌రావు, నవతెలంగాణ బోర్డు సభ్యులు, జీఎంలు, రీజినల్‌ మేనేజర్లు, సిబ్బంది, ప్రజాశక్తి బాధ్యులు హాజరయ్యారు. అనేక మంది ప్రముఖులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -