Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరామ్మోహన్‌రావు మృతికి నవ తెలంగాణ సంతాపం

రామ్మోహన్‌రావు మృతికి నవ తెలంగాణ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జి.విద్యాసాగర్‌ సోదరుడైన రామ్మోహన్‌రావు అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గల వారి నివాసంలో రామ్మోహన్‌రావు భౌతికకాయానికి నవ తెలంగాణ దినపత్రిక చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌ నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మోహన్‌రావుకు నివాళులు అర్పించిన వారిలో నవతెలంగాణ హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ నరేందర్‌ రెడ్డి, ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ శశిధర్‌ ఉన్నారు.
ఐలూ, సీఐటీయూ సంతాపం
ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ గౌరవాధ్యక్షులుగా ఉన్న సీనియర్‌ న్యాయవాది జి. విద్యాసాగర్‌ సోదరుడు రామ్మోహన్‌ రావు మృతి పట్ల ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐలూ రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కే. పార్థసారథి సంతాపం ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి కే పార్థసారథి, రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌, మాధవరెడ్డి,వెంకటేష్‌ తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామ్మోహన్‌రావు మృతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ తరఫున ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ సంతాపం ప్రకటించారు. రామ్మోహన్‌ రావు భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో వారితో పాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్‌, ఎం.వెంకటేష్‌, కూరపాటి రమేష్‌, ఉపాధ్యక్షులు వీఎస్‌.రావు, కె.ఈశ్వర్‌రావు, ఎం.శ్రీనివాస్‌ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -