క్యారం, చెస్ షటిల్ పోటీలను ప్రారంభించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజియన్ క్రీడలు క్యారం, చెస్, షటిల్ పోటీలు శనివారం నిర్వహించారు. ఈ క్రీడా పోటీలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరై టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా నవ తెలంగాణ రీజియన్ ఉమ్మడి జిల్లా మేనేజర్ సురేష్, స్టాఫ్ రిపోర్టర్ మధు మాట్లాడుతూ.. నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నవతెలంగాణ పత్రికలు పనిచేస్తున్న రిపోర్టర్లకు సిబ్బందికి క్యారం బోర్డ్, చెస్, షటిల్ , క్రికెట్ పోటీలను నిర్వహించామన్నారు. గెలుపొందిన విజేతలకు ఈనెల 23వ తేదీ నిర్వహించే దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గోపి, నవీన్, రాజు, ప్రవీణ్, యూసఫ్, లక్ష్మణ్, గణేష్, శ్యామ్ సుందర్, దేవేందర్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.. సిబ్బందికి ఆటల పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES