స్పందించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
నవతెలంగాణ నసురుల్లాబాద్
బీర్కూర్ మండల శివారు ప్రాంతంలోనీ బీర్కూర్ నుంచి నసురుల్లాబాద్ వెళ్ళే రోడ్డుపై వేసిన చెత్తను బీర్కూర్ ఎంపీడీఓ మహబూబ్, గ్రామ కార్యదర్శి గంగారం తొలగింపజేశారు. బీర్కూర్ నుండి నసురుల్లాబాద్ వెళ్ళే రహదారి పక్కనే గ్రామ చెత్త ను రోడ్డుపై వేయడంతో దుర్వాసన రావడంతో బుధవారం నవతెలంగాణ పత్రికలో ‘రహదారిపై చెత్త డంపింగ్` అనే శీర్షిక ప్రచరితం కావడంతో బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి స్పందించారు. సబ్ కలెక్టర్ ఎంపీడీవో, గ్రామ కార్యదర్శికి రోడ్డుపై చెత్త లేకుండా చూడాలని ఆదేశించడంతో నేడు ఎంపీడీవో మహబూబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను రోడ్డుపై నుంచి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.
రోడ్డుకు ఆనుకొని వేసిన చెత్తను తొలగించి, మట్టిని వేసి చదును చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ చెత్తను వేయటం వల్ల రోడ్డు, చెరువు కలుషితం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. డంప్ యార్డును వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వీరి వెంట గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.