పరిశోధనాత్మక కథనాలకు చిరునామా
పోలీసులకు ప్రజలకు వారధిగా నిలవాలి
నవతెలంగాణ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – భూపాలపల్లి
నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ దినపత్రిక అని, పరిశోధనాత్మక కథనాలకు చిరునామా అని, ఇంకా పోలీసులకు ప్రజలకు వారధిగా నిలవాలనీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్,భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో డిఎస్పి సంపత్ రావు లు వేరు వేరుగా ప్రముఖ దినపత్రిక ‘నవ తెలంగాణ’ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎస్సీ మహిళా హాస్టల్ లో జరిగిన సంఘటనను వెలుగులోకి తేవడంలో నవతెలంగాణ పాత్ర అభినందనీయమన్నారు. ఈ పత్రిక కథనాల ద్వారా పోలీసులకు బాధ్యులను గుర్తించడం, కేసు చేదించడం సులభతరమైందని ప్రశంసించారు. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ప్రత్యేక కథనాలు అందించి ఓటర్లను చైతన్యం చేయడంతో జిల్లాలో 85% శాతం పోలింగ్ జరిగిందని గుర్తు చేశారు.
సమాజంలో పత్రికలు నిష్పక్షపాతంగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి తీస్తూ పాఠకులకు అవసమయ్యే విధంగా భిన్నమైన కథనాలను అందించాలని సూచించారు. పత్రికలు సామాజిక బాధ్యతతో ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, సామాజిక సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.
కథనాల ద్వారా ప్రజలను చైతన్యం పరుస్తూ, విజ్ఞానం అందించే బాధ్యత పత్రికలపై ఉందన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పై స్పందించాలని, అప్పుడే పత్రికలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రజల, అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న నవతెలంగాణ దినపత్రిక ప్రజల మన్నలను పొందుతూ, మరింత అభివద్ధి చెంది మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పత్రికా యాజమాన్యానికి, విలేకరులకు, పోలీసు అధికారులకు, జిల్లా అధికారులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి,నవతెలంగాణ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్, భూపాలపల్లి టౌన్ రిపోర్టర్ పుల్ల సృజన్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




