Saturday, July 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనవతెలంగాణ సిబ్బంది ఆటల పోటీలు

నవతెలంగాణ సిబ్బంది ఆటల పోటీలు

- Advertisement -

మహిళల క్రీడా పోటీలు ప్రారంభించిన
బుకహేౌస్‌ ఎడిటర్‌ ఆనందాచారి
నవతెలంగాణ-సిటీబ్యూరో

నవతెలంగాణ తెలుగు దినపత్రిక దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం ఆటల పోటీలు నిర్వహించారు. క్యారమ్స్‌, చెస్‌లలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలను నవతెలంగాణ బుకహేౌస్‌ ఎడిటర్‌ ఆనందచారి ప్రారంభించారు. నవతెలంగాణ హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ నరేందర్‌రెడ్డి పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుకహేౌస్‌ ఎడిటర్‌ మాట్లాడుతూ.. మహిళలు ఆటల పోటీల్లో పాల్గొనడం వల్ల వారిలో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పారు. నిత్యం ఉత్సాహపూరితమైన వాతావరణంలో పని చేసేందుకు ఆటలు పోటీలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. ఇక పురుషుల విభాగంలో బ్యాడ్మింటన్‌ను రామ్‌నగర్‌లోని వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. బ్యాడ్మింటన్‌లో మొదటి బహుమతి శశిధర్‌, అర్జున్‌, రెండో బహుమతి లింగారెడ్డి, ఉపేందర్‌ దక్కించుకుని విజేతలుగా నిలిచారు. పురుషుల చెస్‌, క్యారమ్స్‌ విభాగాల్లో కొన్ని రౌండ్లు పూర్తికాగా, శనివారం మహిళలకు, పురుషులకు మరికొన్ని రౌండ్ల పోటీలు నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -