- Advertisement -
- అనిల్ కుమార్ చిత్రపటానికి నివాలర్పించిన నవతెలంగాణ సిబ్బంది
నవతెలంగాణ-హైదరాబాద్: మెదక్ రీజనల్ డెస్క్ ఇన్‌చార్జీ అనిల్ కుమార్ గుండెపోటుతో అకాల మృతి పట్ల హైదరాబాద్ లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీజీఎం పి.ప్రభాకర్‌తో పాటు సిబ్బంది నివాలర్పించారు. విలువైన ఉద్యోగున్ని కోల్పోవడం చాలా బాధకరమని, ఆయన కుటుంబసభ్యులకు సంస్థ, సిబ్బంది తరుపున సీజీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాలుగేండ్లపైగా సంస్థలో పని చేస్తూ డెస్క్ ఇన్‌చార్జీ స్థాయికి అనిల్ కుమార్ ఎదిగారని, తోటి ఉద్యోగులతో అన్యోన్యంగా ఉంటూ పని పట్ల నిబద్దతో ఉండేవారని ఆయన కొనియాడారు. గుండెపోటుతో అనిల్ కుమార్ చనిపోవడం చాలా బాధించిందని, తోటి సహచరున్ని కోల్పోయమని బుక్ హోస్ ఎడిటర్ ఆనందాచారి విచారం వ్యక్తం చేశారు. - సంస్థ పట్ల నిబద్ధత, అంకిత భావంతో అనిల్ కుమార్ పని చేశారని మొఫిషల్ ఇన్‌చార్జీ వేణు భావోద్వేగానికి గురైయ్యారు. హెచ్ ఆర్ జనరల్ మేనేజర్ పి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉంటూనే తాను పని చేస్తూ, ఇతరుల చేత పని చేయించిన వ్యక్తి అనిల్ అని తెలిపారు.మంచి మిత్రుని కోల్పోయమని బోర్డు సభ్యులు, వెబ్ సైట్ ఇన్‌చార్జీ మోహన్ కృష్ట విచారం వ్యక్తం చేశారు. పని పట్ల అంకిత భావంతో ఉండేవారని చెప్పారు. అనిల్ కుమార్‌తో పని చేసిన రోజులు మరువలేనివని హైదరాబాద్ డెస్క్ ఇన్‌చార్జీ శివకుమార్ అన్నారు. ఆయన మరణవార్త తనను తీవ్రంగా బాధించిందని, వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అంతకముందు అనిల్ కుమార్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామైన సంగారెడ్డిలోని సదాశివపేటలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మొఫిషల్ ఇన్‌చార్జీ వేణు హాజరయ్యారు.



- Advertisement -