Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవిద్యాశాఖ సంచాలకులుగా నవిన్‌ నికోలస్‌ బాధ్యతల స్వీకరణ

విద్యాశాఖ సంచాలకులుగా నవిన్‌ నికోలస్‌ బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఈ నవీన్‌ నికోలస్‌ సోమవారం హైదరాబాద్‌లో బాధ్యతలను స్వీకరించారు. ఆయన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శిగా పనిచేసిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పనిచేసిన ఈవి నరసింహారెడ్డి స్థానంలో నవీన్‌ నికోలస్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి సంఘాలు సహకరించాలి : నవిన్‌ నికోలస్‌
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని నవిన్‌ నికోలస్‌ కోరారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఆయన బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్‌ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరారు. పర్యవేక్షణ అదికారులను నియమించాలని తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరామని పేర్కొన్నారు. దీనిపై డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వ విద్యాభివృద్ధి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు తమవంతు సహకరించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad