Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష 

ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష 

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయనికి శనివారం నిర్వహించిన లాటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల ఎగ్జామ్ ఇంచార్జ్ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 11 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 944 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 620 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఆయన అన్నారు. 11వ తరగతి ప్రవేశ పరీక్షకు 1695 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 999 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -