- Advertisement -
హైదరాబాద్ : భారతదేశంలో మేధస్సు ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు (ఐడీడీఎస్) సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అయినా ‘నయీ దిశ’ పిల్లల సంరక్షణలో 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. 2015లో హైదరాబాద్‌లో ఒక సమాచార కేంద్రంగా ప్రారంభమైన తమ జర్నీ.. ప్రాచీ డియో అనే మహిళ తన సోదరుడికి డౌన్ సిండ్రోమ్ ఉన్నందున అతడిని చూసుకునే సమయంలో తమ కుటుంబం ఎలాంటి కష్టాలు పడిందో దగ్గర నుండి చూసిందని పేర్కొంది. ఎదుగుదల సమస్యలు ఉన్న బిడ్డను పెంచడంలో ఉన్న ఆ సవాళ్లను ప్రత్యక్షంగా చూసిన ప్రాచీ డియో, ఆ వ్యక్తిగత అనుభవంతోనే స్ఫూర్తి పొంది నయీ దిశ సంస్థను ప్రారంభించామని డీఎఫ్‌జీసీ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ గడ్డం తెలిపారు.
- Advertisement -



