నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
1930లో స్థాపించిన ఎన్సీసీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అతి పెద్ద యూత్ ఆర్గనైజేషన్ ఎదిగిందని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విక్రమ్ ప్రతాప్ సింగ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 32వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏటీసీ 3వ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు ఆయన ముఖ్య అథితిగా హాజరై క్యాడెట్లకు ఎన్సీసీ లక్ష్యాలను తెలియజేశారు. అనంతరం గ్రౌండ్లో క్యాడెట్ల ధృఢత్వం, క్రమశిక్షణ అలవాట్ల గురించి వివరించారు.
ఈ సందర్భంగా కమాండింగ్ అధికారి కల్నాల్ విక్రమ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. 1930లో స్థాపించిన ఎన్సీసీ స్వతంత్య్రం తరువాత ఆర్మీ యాక్టివిటిస్ గురించి శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందన్నారు. ఇందులో నేవి, ఎయిర్ ఫోర్స్ చేయడంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద యువత గల ఆర్గనైజేషన్గా గుర్తింపు పొందిందన్నారు. ఎన్సీసీలో దేశ రక్షణతో పాటు క్రమశిక్షణ, నాయత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతల గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు. అందు కోసం పది రోజుల శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్యాడెట్లు శిక్షణాలు పూర్తి చేసుకుంటు రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటి లెఫ్టింట్ కల్నాల్ అరవింద్ కుమార్ కిచ్చర్, సీనియర్ అధికారి ఎల్బీ గాలి అశోక్, రజిత, పుట్ట లక్ష్మణ్, భూమన్న, మధురావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
యూత్ ఆర్గనైజేషన్ గా ఎదిగిన ఎన్ సీసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES