నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శాఖాధికారుల సమీక్ష సమావేశంలో బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2400 కోట్ల మైలురాయి చేరుకుంది. ఇందుకు గానూ గురువారం బ్యాంకు అధ్యక్షలు కుంట రమేష్ రెడ్డి కేకు కోసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందులో రూ.787 కోట్లు డిపాజిట్లు, రూ.1613 కోట్లు ఋణములు ఉన్నవని తెలిపారు. ప్రతీ ఉద్యోగి లక్ష్యం, నిబద్దత ద్వారా ఈ ఘనత సాధ్యమైనదని వివరించారు. రాబోవు కాలము లో ఇంకనూ వ్యాపార లావాదేవీలు పెంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరకు మరింతగా వృద్ధి చేయాలని సూచించారు.
నష్టాలలో శాఖలను లాభంలోకి తీసుకు వచ్చేవిధముగా కృషి చేయాలని సూచించారు. ఎప్పటికి అప్పుడు సమీక్షా చేస్తూ క్షేత్ర స్థాయిలో శాఖాధికారులను దిశా నిర్దేశం చేస్తున్న ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఉన్నతాధికారులను ప్రత్యేకముగా అభినందించారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి మొదటి విడత ఏరియరస్ ఉద్యోగుల ఖాతాలో జమచేసినందుకు కృతజ్ఞతగా ఉద్యోగులు అధ్యక్షులు, పాలకవర్గసభ్యులకు ధన్యవాదములు తెలిపి, భవిష్యత్తు కాలములో ఉద్యోగుల ఇంకనూ నిబద్దతతో పని చేస్తామని హమీ ఇచ్చారు. ఈ సమావేశములో బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే , ఉన్నతాధికారులు, 63 శాఖ ల శాఖాధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్డిసీసీబీ రూ.2400 కోట్ల మైలురాయి చేరుకుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES