Sunday, May 18, 2025
Homeతెలంగాణ రౌండప్మలబార్ లో నెక్లెస్ మేళా

మలబార్ లో నెక్లెస్ మేళా

- Advertisement -

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నెక్లెస్ మేళా శనివారం షోరూం హెడ్ అక్షయ్, మేనేజర్, ప్రశాంత్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళల ద్వారా నెక్లెస్ మేళాలో ప్రదర్శించే నగలను సందర్శనకు ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజామాబాద్ లో నెక్లెస్ మేళా ఈ నెల 16 నుంచి 25 వరకు కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా 22 క్యారెట్ల పాత బంగారు నగల మార్పిడిపై జీరో శాతం తగ్గింపు, పరిమితకాలపు ఆభరణాల ప్రదర్శనలు అద్బుతమైన బంగారు రత్నాలు, వజ్రాలతో కూడిన నెక్లెస్ ఆభరణాలు లభిస్తాయన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారులకు 11 నాణ్యమైన వాగ్ధానాలను అందిస్తుందన్నారు. కచ్చితమైన తయారి ధర, రాళ్ళ బరువు, నికర బరువు, ఆభరణాల రాళ్ళ విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ, బంగారు మార్పిడిపై శూన్య తగ్గింపు ఉంటుందన్నారు. వంద శాతం బిబిఎస్ హాల్ మార్క్ తో దృవీకరించబడిన స్వచ్చమైన హెచ్ యుఐడి బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజీఐ, జీఐఏ దృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ, బాధ్యతాయుతమైన మూలాల నుంచి బంగారం సేకరణ వంటి వాగ్ధానాలను అందిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -