Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeమానవినియంత్రణ అవసరం

నియంత్రణ అవసరం

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
ఎలా ఉన్నావు? ఇక్కడ నేను, నాన్న బాగున్నాము. ఇద్దరం ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నాం. అక్కడ కూడా వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పావు. జాగ్రత్తగా ఉండు. వర్షంలో తడవకు. వినాయకచవితి రోజున చాలా సార్లు గుర్తుకు వచ్చావు. ఏం చేస్తాం ఉద్యోగం తప్పదు కదా!
నాన్న కిందటి ఉత్తరంలో ఫోన్‌ గురించి చెప్పాను. ఈ ఉత్తరంలో కూడా ఫోన్‌ గురించే చెప్తాను. చిన్న చిన్న తప్పులు ప్రాణాలు తీసేస్తాయి. ఇది తెలిసి కూడా మనుషులు తప్పు చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతిరోజు ఎంతమందినో చూస్తుంటాను, రోడ్డు మీద ఫోన్‌ మాట్లాడుతూ వెళ్తుంటారు. పక్కన ఏమోస్తుందో చూసుకోరు. బస్సు, ఆటో డ్రైవర్లు ఫోన్‌ మాట్లాడుతూ బండి నడుపుతూ ఉంటారు. బస్‌ డ్రైవర్లు అయితే స్టీరింగ్‌ వదిలేసి ఫోన్‌ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ప్రమాదాలకు ఫోన్‌ మాట్లాడుతూ బండి నడపడమే కారణం. మరికొందరు రైలు పట్టాలను ఫోన్‌ మాట్లాడుతూ దాటుతుంటారు. ఎటువైపు నుంచి రైలు వచ్చేది చూసుకోరు. ఇంకా దారుణం ఏమిటంటే ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తూ ఒక చేత్తో ఫోన్‌ మాట్లాడుతూ మరో చేత్తో బండి నడపడం. కారు నడిపే వారు కొందరు బ్లూటూత్‌ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఇది కొంత నయం.
ఇవన్నీ మనిషి తెలిసి చేస్తున్న తప్పులు. మీ నాన్న ఎప్పుడూ బండి నడిపేటప్పుడు ఫోన్‌ మాట్లాడరు. ఆఫీస్‌ ఫోన్లు వస్తుంటే బండి పక్కకు ఆపి ఫోన్‌ మాట్లాడతారు. ఇది చాలా మంచి పద్ధతి. నేను అప్పడప్పుడు కొన్ని తప్పని సరి ఫోన్లు మాట్లాడవలసి వస్తుంది. రోడ్డుమీద ఒక పక్కగా నడుస్తూ మాట్లాడతా, ఇప్పుడైతే అది కూడా తగ్గించేసాను. మరీ ముఖ్యమనుకుంటే ఒక పక్కాగా నిలబడి మాట్లాడతా లేదా వాళ్లతో ‘నేను బైట ఉన్నాను ఇంటికి వెళ్ళాక చేస్తా’ అని చెప్తాను.
ఎవరైనా సరే బండి నడుపుతూ ఫోన్లు మాట్లాడేకంటే, ఒక పక్కాగా ఆపి ఫోన్‌ మాట్లాడటం మంచిది నాన్న. బస్‌ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు మనం చెప్పలేము. ప్రభుత్వమే కఠిన చట్టాలు తేవాలి. కఠిన శిక్షలు అమలు చేయాలి. ఫోన్‌ ఏ సమయంలో ఎంత ఉపయోగించాలో తెలుకోవాలి. అలా నియంత్రణ అనేది లేకపోతే ప్రాణాలకు నష్టం. ఇది అందరూ తెలుసుకుని తమ జాగ్రత్తలో తాము ఉంటే అందరికి మంచిది.

ప్రేమతో మీ అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad