Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిచ్కుందలో నీలం మధు ముమ్మర ప్రచారం..

బిచ్కుందలో నీలం మధు ముమ్మర ప్రచారం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నీలం మధు అన్నారు. శనివారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో గల వార్డులలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కలిసి ముమ్మురా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శివాజీ చౌక్ వద్ద ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు మున్సిపల్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజాక్షేమం కోసం కృషి చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో 90% స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని ఇదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లో సైతం హస్తం విజయదుందుభి మోగించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు పూర్తవగానే ఈ నిధులతో ప్రజలకు కావలసిన మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు ఖర్చుపెట్టి ప్రతి వాడను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -