- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సహానీ శుక్రవారం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెబ్ కాస్టింగ్‌ను ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఐ.రాణి కుముదిని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ గురించి సహానీకి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



