11 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) వంటి అత్యంత బాధ్యతాయుతమైన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 11 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లపై హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి(డీఈవో) రోహిణి కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఉత్తర్వులను బేఖాతరు చేసిన ఉపాధ్యాయులు
2026 ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాల ప్రకటనలో భాగంగా.. విద్యాశాఖ పలువురు ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులు కేటాయించింది. అయితే, నియామక ఉత్తర్వులు అందినప్పటికీ, బహదూర్‌పురా, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, సైదాబాద్ జోన్లకు చెందిన 11 మంది ఉపాధ్యాయులు ఎటువంటి ముందస్తు సమాచారం, సెలవు దరఖాస్తు లేకుండానే గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఫలితాల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా వ్యవహరించడంపై డీఈవో ఆర్. రోహిణి సీరియస్‌గా తీసుకున్నారు. వీరి చర్యలు తెలంగాణ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టానికి విరుద్ధమని స్పష్టం చేశారు.
నోటీసులు అందుకున్న మూడు రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో, సదరు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. సస్పెన్షన్ వేటుతో పాటు, ఇంక్రిమెంట్లను నిలిపివేసేందుకూ వెనుకాడబోమని ఆమె తెలిపారు. బహదూర్‌పురాలో సయ్యదా అసిమా తస్నీమ్, సయ్యదా బాదర్ ఉన్నీసా, మహ్మద్ మొహియుద్దీన్, మొహమ్మద్ అబ్దుల్ మోయిజ్, సయ్యదా అసిమా తహసీన్, బండ్లగూడలో ఫౌజియా సుల్తానా, చార్మినార్‌లో ఎం.ఏ మొఘని మసూద్, షహానా సుల్తానా, గోల్కొండలో హుమైరా తస్నీమ్, నజీమా తన్వీర్, సైదాబాద్‌లో షేక్ ఎండీ సిరాజుద్దీన్ షోకాజ్ నోటీసులు అందుకున్నారు.
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌లో నిర్లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



