విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమ..?
నవతెలంగాణ – కాటారం
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమా…?లేక ఇంజనీరింగ్ అధికారుల అలసత్వమో తెలియదు. కానీ అధికారుల నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్లు చేస్తున్న అభివృద్ధి పనులివి.. కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు మధ్య లో విద్యుత్ స్తంభాలు ఉన్నా అలాగే సీసీ రోడ్డును సదరు కాంట్రాక్టర్ వేసేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
ఏదేమైనా అభివృద్ధి పనులు చేశామని చెప్పుకోవడానికి తూ తూ మంత్రంగా పనులు చేసేసి ఇలా స్తంభాలను రోడ్డు మధ్యలోనే వదిలివేయడాన్ని చూస్తుంటే అభివృద్ధి పనుల పై కాంట్రాక్టర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉన్న ఆసక్తి ఇట్టే తెలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పనులు సఖ్యతగా చేయాలని, స్తంభాల ను పక్కకు జరిపి ఇబ్బందులు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.