Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంపీవోకే అంశం లేకుంటే చర్చలు అనవసరం

పీవోకే అంశం లేకుంటే చర్చలు అనవసరం

- Advertisement -

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఇప్పటికీ హైదరాబాద్‌లో టెర్రరిస్టుల స్లీపర్‌సెల్స్‌ : విద్యాసాగర్‌రావు
హైదరాబాద్‌లో తిరంగా యాత్ర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశంపై తప్పితే పాకిస్తాన్‌తో చర్చలు అనవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంతో సైన్యానికి మద్దతుగా సిటిజన్స్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన తిరంగా యాత్రను నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శాసనమండలి బీజేపీపక్ష నేత ఏవీఎన్‌.రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి అభరుపాటిల్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, రఘునందన్‌రావు, డి.అర్వింద్‌, గోడెం నగేశ్‌, ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యేలు రామారావు పాటిల్‌, ధన్‌పాల్‌ సూర్యనారాణ, రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డి, డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, ఎల్‌.దీపక్‌రెడ్డి, గౌతంరావు, డీఆర్డీఓ మాజీ చైర్మెన్‌ సతీశ్‌రెడ్డి, సీఆర్పీఎఫ్‌ మాజీ డీజీ కృష్ణారెడ్డి, జమ్మూకాశ్మీర్‌ మాజీ డీజీలు రాజేందక్రుమార్‌, గోపాల్‌రెడ్డి, సమ్మక్కసారలమ్మ వర్సిటీ వీసీ వైఎల్‌.శ్రీనివాస్‌, ప్రముఖ సినీగాయకులు వందేమాతం శ్రీనివాస్‌, సినీ నటులు జయప్రద, మంచులక్ష్మి, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, గాయని మంగ్లీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్‌ చేశారు. భారత్‌ శాంతి కోరుకునే దేశమని నొక్కిచెప్పారు. ఎప్పుడూ దేశంపై దాడి చేయలేదని స్పష్టంచేశారు. పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేశామనీ, ఆ దేశపాలకులు మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ.. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఉగ్రవాదులు స్లీపర్‌ సెల్స్‌గా ఉన్నారని చెప్పారు. నగరంలో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా తరమివేయాలని కోరారు. రాజ్యసభ సభ్యులు అర్‌ కష్ణయ్య మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయని కొనియాడారు. డీకే అరుణ మాట్లాడుతూ.. భారత్‌ వైపు చూస్తే పాకిస్తాన్‌ దేశం మిగలదనేలా ప్రధాని మోడీ సంకేతాలిచ్చారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళపరిచే కుట్ర జరిగిందనీ, భారత్‌ కు తన కాళ్లపై తాను నిలబడే శక్తి ఉందని వివరించారు. వీర జవాన్‌ మురళీ నాయక్‌ కు నివాళులర్పించారు. ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థ భారత్‌ వైపు కన్నెత్తి చూసేందుకు భయటపడేలా మోడీ బదులిచ్చారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -