చర్చల మధ్యలోనే వెళ్ళిపోయిన పలువురు నిర్మాతలు
సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ఇంకా కొలిక్కి రాలేదని నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు చెప్పారు. బుధవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీర శంకర్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు మధ్య చర్చలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఈ చర్చల్లో ఇరువర్గాలు ఎవరికి వారు తగ్గేదేలా అన్నట్టు వ్యవహరించినట్టు సమాచారం.
షూటింగ్‌లుfdc బంద్ చేసుకుంటే చేసుకోండి.. ఫెడరేషన్ బెదిరింపులకు మేం లొంగం అని పలువురు నిర్మాతలు ఘాటుగా స్పందిస్తే, మరికొంత మంది నిర్మాతలు ఆగ్రహంతో చర్చల మధ్యలోనే వెళ్ళిపోయారు.
అనంతరం దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ, ‘వేతనాలు పెంచాలని గత కొది రోజులుగా ఫెడరేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పని విధానాలపై నిర్మాతల నుంచి కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా 2018, 2022లలో జరిగిన అగ్రిమెంట్స్‌లో ఉన్న రెండు షరతులను వాళ్ళు అమలు చేయటం లేదు. ముందు వాటిని ఒప్పుకోవాలి. అలాగే వీటితోపాటు మరో రెండు షరతులు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఛాంబర్ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుని, అలాగే పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నాం. రోజువారి రూ.2 వేల కన్నా తక్కువ తీసుకునే వారికి ఒక పర్సంటేజ్ ఆఫర్ చేస్తున్నాం. దాని కన్నా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్ళకు మరొక పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్లతో మాట్లాడుకుని వస్తే, దీనిని పరిష్కరిస్తాం. దీని కోసం మరో రెండు, మూడు సార్లు చర్చలు జరగాల్సి ఉంటుంది’ అని తెలిపారు.
మరో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ,’సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లోనే అన్నింటికి మంచి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు.
కొలిక్కిరాని చర్చలు
- Advertisement -
- Advertisement -