పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
లండన్ : పొరుగు దేశాలు పరస్పర సహకారంతో కలిసివుండటం నేర్చుకోవాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. లండన్‌లో ఆదివారం ప్రవాస పాకిస్థానీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించకుండానే భారత్- పాక్ మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా విశ్వసిస్తున్నారంటే.. వారు భ్రమలో జీవిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. భారత్- పాక్ రెండూ పొరుగు దేశాలని, కలిసి ఉండటం నేర్చుకోవాలని తెలిపారు. అయితే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించనంత వరకు ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోలేవు అని చెప్పారు. కశ్మీరీ ప్రజల త్యాగాలను వృథా కానివ్వబోమని, భారత్ సహకారం అందించే బదులు.. పోరాట ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు. పహల్గాం ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా జీవించాలా? లేదా పోరాటం కొనసాగించాలా అనేది మన చేతుల్లోనే ఉందని ఆయన ప్రవాసీయులను ఉద్దేశించి పేర్కొన్నారు.
పొరుగు దేశాలు కలిసివుండటం నేర్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES