నవ తెలంగాణ – హైదరాబాద్
అర్కిటెక్చర్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలోని నెమెట్‌షేక్ గ్రూపు హైదరాబాద్‌లో తన ఆధునిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని ఐఎస్‌ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జెఎ చౌదరి, నెమెట్‌షెక్ సిఎఫ్‌ఒ లూయిస్ ఓఫ్వరస్ట్రోమ్ లాంచనంగా ప్రారంభించారు. భారత్‌లో నెమెట్‌షెక్ వ్యూహాత్మక విస్తరణలో ఒక కీలక మైలురాయిగా నిలిస్తుందని లూయిస్ పేర్కొన్నారు. ప్రస్తుత కార్యకలాపాలకు తోడు ఈ కొత్త విస్తరణ ఆధునిక పరిశోధన, వినూత్న సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, గ్లోబల్ టీమ్‌లతో సహకారం కోసం ఒక కేంద్రంగా పనిచేస్తుందన్నారు. 250 మందికి పైగా పూర్తి స్థాయి సిబ్బందిని కలుపుకునే సామర్థ్యం కలిగిన ఈ సదుపాయం, భారతదేశంలోని అత్యంత చురుకైన టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో నెమెట్‌షెక్ తన ఉనికిని బలపరచాలనే సంకల్పాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తుందన్నారు.
హైదరాబాద్‌లో నెమెట్‌షేక్ గ్రూప్ కొత్త సెంటర్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -