హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కిన కాంబోలో రాబోతున్న ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. టీజర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఈ టీజర్ ఒక ఎంటర్టైనింగ్ కథాంశాన్ని పరిచయం చేస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధ్యత గల మధ్యతరగతి ఆంధ్ర యువకుడికి, ఒక మధ్య తరగతి తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, దానివల్ల కల్చర్, లైఫ్ స్టయిల్ మధ్య హిలేరియస్ కాన్ఫ్లిక్ట్‌కి దారితీయడం ఆసక్తికరంగా ఉంది.
త్రినాధ రావు నక్కిన మరోసారి కంప్లీట్ ఎంటర్టైనర్ రూపొందించడంలో తన మార్క్‌ని చూపించారు.
అమ్మాయి కుటుంబం మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడటం, అబ్బాయి కుటుంబం శాకాహారాన్ని పాటించడం వంటి సహజమైన పరిస్థితుల ద్వారా హాస్యాన్ని పండించారు. హవిష్ బాధ్యత గల మధ్యతరగతి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయి, తన స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. కావ్య థాపర్ నిజాం అమ్మాయిగా ఆకట్టుకుంది. వారిద్దరి కెమిస్ట్రీ ఎట్రాక్టీవ్‌గా ఉంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్ వంటి హాస్య నటులు ఉండటంతో ఈ చిత్రం నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తుందని ప్రామిస్ చేస్తుంది. సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా విడుదల కానుంది.
సమ్మర్ స్పెషల్‌గా ‘నేను రెడీ’ రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



