నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌టిడబ్ల్యుఎఫ్) జాతీయ అధ్యక్షులు, సీఐటీయూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు నేపాల్ దేవ్ భట్టాచార్య (74) మృతి కార్మికవర్గానికి తీరని లోటని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు పూలమాల వేసి నివాళి అర్పిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేపాల్ దేవ్ భట్టాచార్య గతంలో రెండుసార్లు భారత విద్యార్ధి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారనీ, బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటరీ రంగంలో కూడా విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన నిబద్ధత గల నాయకుడనీ, సీఐటీయూ నిర్మాణ పద్ధతులను నిక్కచ్చిగా అమలు చేసి కార్మిక రంగంలో విశేష కృషి చేశారని కొనియాడారు. 2022 జూలైలో హర్యానాలోని హిస్సార్‌లో జరిగిన ఏఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌కు అధ్యక్షునిగా ఎన్నికై పని చేస్తున్నారనీ, రవాణా రంగంలోని అందర్నీ ఐక్యం చేసేందుకు కృషి చేశారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ప్రతినబూనారు. నేపాల్‌దేవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. సంతాప కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, భూపాల్, ఎస్వీ.రమ. వీఎస్. రావు, పి.జయలక్ష్మి, కె. ఈశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, బి. మధు, జె. చంద్రశేఖర్, కాసు మాధవి, కోశాధికారి వంగూరు రాములు తదితరులు సంతాపం తెలిపారు.
నేపాల్ దేవ్ భట్టాచార్య మృతి కార్మికవర్గానికి తీరని లోటు : సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES