Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేసిన నేరల్ గ్రామస్తులు

పాఠశాలకు డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేసిన నేరల్ గ్రామస్తులు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని నేరల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు గ్రామంలోని యువకులు చందలు చేసి పాఠశాలకుడ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోరిక మేరకుఉపాధ్యాయురాలు సింగారం ప్రశాంతి, గ్రామ పెద్దలు యువకుల సహకారంతో వినాయక చవితికి ఏ విధంగా నైతే చందాలు స్వీకరించి పండగను జరుపుకుంటారో అదేవిధంగా పాఠశాల కొరకు చందాల డబ్బులు పోగు చేసి అందాల ద్వారా వచ్చిన డబ్బులను విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచెస్ ను గ్రామస్తులు పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ.. నేరల్ గ్రామ ప్రజలను మండలం లోని అన్ని గ్రామాల ప్రజలు ఆదర్శంగా తీసుకొని వారి గ్రామాల్లోని పాఠశాలలకు వారికి తోచిన విధంగా అభివృద్ధి పరచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీహరి, కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్  గ్రామ పెద్దలు షేక్అబ్బు, సంతోష్, శ్రీనివాస్, అయ్యుబ్, సాయిలు, గఫూర్, గ్రామ సెక్రటరీ రేణుక, ఉపాధ్యాయురాలు  రేణుక  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -