వచ్చే రెండేండ్లలో తొలగింపులు
వాషింగ్టన్ : ప్రముఖ గ్లోబల్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ నెస్లే తమ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయిం చింది. వచ్చే రెండేండ్లలో 16,000 మంది సిబ్బందిని ఇంటికి పంపించనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ వెల్లడించారు. ఇందుకోసం కసరత్తు చేస్తోన్నామన్నారు. ప్రపంచం మారుతోందని.. దానికి తగ్గట్లే వేగంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కఠిమైన నిర్ణయమే అయినప్పటికీ మార్పులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదించు కుంటున్నామన్నారు. ఉత్పత్తి, సరఫరా విభాగాల్లో ఇప్పటికే 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. దాంతోపాటు మరో 12 వేల మంది వైట్‌కాలర్ సిబ్బందిపై వేటు పడనుందన్నారు. ఈ కోత వల్ల సంస్థకు ఒక బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.11వేల కోట్లు) ఆదా కానున్నాయి. 2027 నాటికి దాదాపు రూ.33వేల కోట్లు ఆదా చేసుకోవలని లక్ష్యంగా పెట్టుకుంది.
16వేల ఉద్యోగులపై నెస్లే వేటు
- Advertisement -
- Advertisement -