Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేతన్నకు అభయ హస్తం పథకంపై అవగాహన…

నేతన్నకు అభయ హస్తం పథకంపై అవగాహన…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ  నేతన్నకు అభయ హస్తం పథకం ప్రవేశపెట్టిందని ఈ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నిర్వహించనున్నట్లు ముఖ్యఅతిథిగా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య హాజరుకానున్నట్లు చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి తెలిపారు. ఈనెల 22వ తేదీన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మ వంశీ  ఫంక్షన్ హాల్లో జిల్లాలోని చేనేత కార్మికులకు “తెలంగాణ నేతన్నకు అభయ హస్తం పథకాలు మూడు అని, 1) తెలంగాణ నేతన్న  భరోసా ,2. తెలంగాణ నేతన్న భద్రత  3. తెలంగాణ నేతన్న పొదుపు పథకాలను చేనేత కార్మికుల కోసం మార్గదర్శకాలను విడుదల, చేనేత కార్మికులకు అమలు చేయుట కోసం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందనారు. జిల్లాలోని చేనేత కార్మికులు కళాకారులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -