చేనేత, జౌలిశాఖ సహాయ సంచాలకులు ఏ.శ్రీనివాస రావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నేతన్నకు నేతన్న భరోసా మార్కెట్ డెవలప్మెంట్ పథకం ప్రకారం జియో ట్యాగింగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికుడు ఈ నేతన్న భరోసా పథకంలో అర్హత కలిగి ఉంటాడనీ చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఏ శ్రీనివాసరావు కోరారు.
ఒక సంవత్సరంలో గరిష్టంగా 8 వార్పులు అనగా 56 చీరలు కనిష్టంగా నాలుగు వార్పులు అనగా 28 చీరలు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ ఉత్పత్తులపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ప్రత్యేక లోగోను వేసి మార్కెట్లో అమ్ముకోవాల్సి ఉంటుందనీ. ఇలా కనీసం 50% చీరలు నేసిన చేనేత కార్మికుడికి సంవత్సరానికి రూ 18000/- వారి అనుబంధ కార్మికుడికి రూ 6000/- నేరుగా ఖాతాలో జమ చేయడం జరుగుతుందనారు.
ఈ మొత్తాన్ని ఆరు మాసాలకి సగం చొప్పున ఇవ్వడం జరుగుతుందనీ , ఈ పథకంలో చేనేత కార్మికులు నమోదు కావాలంటే చేనేత కార్మికుడి , అనుబంధ కార్మికుల యొక్క వివరాలు పొందుపరిచి న దరఖాస్తు ఫారం ఎ, తెలంగాణ చేనేత లేబుల్ కొరకు దరఖాస్తు ఫారం బి లను, చేనేత జౌళి శాఖ అధికారులు ఆయా గ్రామాలలో పర్యటించి తగు అవగాహన కల్పించి , స్వీకరించడం జరుగుతుందనారు. దరఖాస్తు ఫారం తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీలు జమ చేయవలసి ఉంటుందనీ , జిల్లాలోని చేనేత కార్మికులు అందరూ కూడా తమ తమ దరఖాస్తులను మీ గ్రామాలకు 22 జూలై 31 జులై వచ్చినటువంటి కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
నేతన్నకు భరోసా మార్కెట్ డెవలప్మెంట్ పథకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES