కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవచ్చు
ఆ సంస్థ హైదరాబాద్ వస్తే హాలీవుడ్ వచ్చినట్టే : నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్‌సిటీలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ సంస్థ హైదరాబాద్ వస్తే, హాలీవుడ్ తరలివచ్చినట్టే అని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్‌ను గురువారంనాడాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీవీడీలు అద్దెకు ఇచ్చే స్థాయి నుంచి నెట్‌ఫ్లిక్స్ సంస్థ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్నదనీ, అనేక ప్రపంచ సంస్థలకు వేదిక అవుతున్నదని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ క్రీడలపై దృష్టి పెట్టిందనీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడారంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నదని వివరించారు.
దానికోసమే క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నెట్‌ఫ్లిక్స్ రాకతో ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తెలంగాణ పాత్ర పెరిగిందని చెప్పారు. అనేక తెలుగు సినిమాలు అత్యున్నత సాంకేతికతతో అంతర్జాతీయ ఖ్యాతి గచించాయన్నారు. చెన్నైలో ఉన్న సినిమా పరిశ్రమను ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఫ్యూచర్‌సిటీలో ప్రపంచంలోని 500 పెద్ద కంపెనీలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వారి పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సినీనటుడు రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్యూచర్‌సిటీలో భూమి ఇస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



