నవతెలంగాణ – హైదరాబాద్ : అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. నెదర్లాండ్స్ జట్టు 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డీ లీడ్ అర్ధశతకంతో (72*) అజేయంగా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోలిన్ అకెర్మాన్ (32), మిచెల్ లివిట్ (28) రాణించారు. చివర్లో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ (18) వేగంగా పరుగులు రాబట్టాడు. నమీబియా బౌలర్లలో బెర్నార్డ్, రూబెన్, జాన్ నికోల్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు నమీబియా బ్యాటర్లలో జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42), జాన్ ఫ్రైలింక్ (30), జేజే స్మిత్ (22) రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్, బాస్ డీ లీడే తలో రెండు, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ చెరో వికెట్ తీసుకున్నారు.
నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



